Goutam Menon Interview About SSS

`సాహ‌సం శ్వాస‌గా సాగిపో` సినిమా స‌క్సెస్ ప‌ట్ల చాలా హ్యాపీగా ఉన్నాను - గౌత‌మ్‌మీన‌న్‌

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌తో ఇంట‌ర్వ్యూ.....

సినిమా స‌క్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
- చాలా బాగుంది. తెలుగు వర్షన్‌తో పాటు తమిళ వర్షన్‌కు(అచ్చమ్ ఎన్బదు మదమైదా – శింబు హీరో) కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. యంగ్‌స్టర్స్ అంతా రొమాన్స్, యాక్షన్‌ను మిక్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిలీజ్‌కి ఇంత లేట్ అయినా అందరూ ఆ విషయాన్ని పక్కనబెట్టేసి సినిమా చూస్తున్నారు. సో, అందరం హ్యాపీ.

సంవత్సరం పాటు రిలీజ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి?
- తెలుగు రిలీజ్‌కు ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. తెలుగులో ఎప్పుడో ఫస్ట్ కాపీతో సహా అంతా రెడీ అయిపోయింది. తమిళ వర్షన్ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యలో చైతూ కూడా ‘ప్రేమమ్’ మొదలుపెట్టడం, అది రిలీజవ్వడం జరిగిపోయాయి. ఇంత లేట్ అయినా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూడడం మాత్రం మర్చిపోలేనిది.

కరన్సీ బ్యాన్ ఉన్న రోజుల్లో సినిమా విడుదల చేయడం రిస్క్ అనిపించలేదా?
కరన్సీ బ్యాన్‌ను తప్పుపట్టడానికి లేదు. నల్లధనాన్ని తరిమేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే! అయితే మేము ముందే మా సినిమా విడుదల తేదీని ప్రకటించేశాం. అప్పటికే అన్నీ సిద్ధమయ్యాయి. మళ్ళీ వాయిదా వేయడమంటే బాగుండదనే చెప్పిన తేదీకే వచ్చేశాం. కరన్సీ బ్యాన్ వల్ల 30% కలెక్షన్స్ తగ్గినా, మరో మూడు వారాలు సినిమా థియేటర్లలోనే ఉంటుంది కాబట్టి మున్ముందు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయన్న నమ్మకం ఉంది.

‘ఏ మాయ చేశావే తరహా’లో ఫస్టాఫ్ నడిపి, సెకండాఫ్ అంతా యాక్షన్ వైపు వెళ్ళారెందుకని?
- ఇది పూర్తిగా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఒక కథగా కాకుండా, హీరో పాత్ర ఎటు వెళ్తే సినిమా అలా సాగుతుంది. ఇలాంటి కథలో ఎన్ని జానర్లైనా ఉండొచ్చన్నది నా అభిప్రాయం. నాక్కూడా రెండు, మూడు జానర్స్ మిక్స్ చేసి ప్రయోగం చేయడం చాలా ఇష్టం. అది ఈ సినిమాతో నెరవేరింది. సెకండాఫ్‌కి ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా కథే మారిపోవడం కొందరికి బాగా నచ్చింది. ఇంకొందరు అస్సలు బాలేదు అన్నారు. ఏదేమైనా సినిమాపైన డిస్కషన్ జరగాలి. అది నేనెప్పుడూ కోరుకుంటూంటా.

నాగ చైతన్యతో మరోసారి పనిచేయడం ఎలా అనిపించింది? ఏ మాయ చేశావే అప్పటికి, ఈ సినిమాకి ఆయనలో వచ్చిన మార్పు?
- వ్యక్తిగా చై అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నాడు. సరదాగా తమ్ముడిలా ఉంటాడు. అతడ్ని డైరెక్ట్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్‌కు రెడీ అయినా కూడా తమిళ వర్షన్ కోసం లేట్ అవుతున్నా ఓపికగా ఉన్నాడు. ఇక హీరోగా అయితే చైతన్య స్థాయి పెరిగింది. సాహసం శ్వాసగా షూట్ అప్పుడు అంటూ ఉండేవాడిని, “ఈ సినిమాతో నువ్వు మాస్ సినిమాలు కూడా చేయొచ్చు” అని. ఇప్పుడు నిజంగానే మాస్ హీరో అవ్వగలిగే లుక్, స్టేటస్ తెచ్చుకున్నాడు. నేనైతే అతడితో ఇంకో సినిమా చేయడానికైనా రెడీ, చైతూకి ఆ ఫీలింగ్ ఉందో లేదో మరి.

క్లైమాక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి కదా, దానిపై మీరేమంటారు?
స) ముందే చెప్పినట్టు ఏ సినిమాకైనా డిస్కషన్ ఉండాలి. అంతవరకూ రియలిస్టిక్‌గా, కాస్త డార్క్‌గా ఉన్న సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా కమర్షియల్ టచ్‌తో ఎండ్ చేశా. ఇది నేను కావాలని తీసుకున్న నిర్ణయమే! గౌతమ్ మీనన్ మాస్ సినిమా తీస్తే ఇలా ఉంటుందని, చివర్లో ఇచ్చిన టచ్ అన్నమాట. నిజం చెప్పాలంటే క్లైమాక్స్‌లో వచ్చే సబ్‌ప్లాట్‌ని డైలాగ్స్ ద్వారా కాకుండా, మాంటేజ్ సీన్లతో చూపాలనుకున్నా. అవి స్క్రిప్ట్‌లో కూడా ఉన్నాయి. కొన్ని అనుకోని కారణాల వల్ల అది షూట్ చేయడం కుదర్లేదు. అయినప్పటికీ చాలామంది ఈ క్లైమాక్స్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

తమిళ వర్షన్ వల్ల తెలుగుకి ఇబ్బందులు వచ్చాయి కదా.. భవిష్యత్‌లో ద్విభాషా చిత్రాలను తీయడం మానేస్తారా?
- అది ద్విభాషా చిత్రం అవ్వడం వల్లనే వచ్చిన సమస్య అని చెప్పలేం. కొన్నిసార్లు పరిస్థితులు అలా మారిపోతాయి. నేనైతే ఏ సినిమా అనుకున్నా మొదట రెండు భాషల్లోనూ ఆ సినిమా చేయాలనే ఎక్కువగా ఆలోచిస్తూంటా. నా మేకింగ్ స్టైల్ కూడా ఎవ్వరికీ ఇబ్బంది పెట్టేదిగా ఉండదు కాబట్టి ద్విభాషా చిత్రంతో సమస్యేం లేదు.

<< Nikhil Interview About Ekkadiki Pothavu Chinnavaada >> Ghatana Telugu Movie Press Meet


View Gallery

    Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS Goutam Menon Interview About SSS


Interviews

More

Events

More