ఇంకొక్కడు రివ్యూ

Inkokkadu-Telugu-Review-0b73d975.jpg

Inkokkadu Review - Inkokkadu Movie Review - Inkokkadu Telugu Movie Review - Inkokkadu Film Rating - Vikram Review - Vikram Telugu Movie Inkokkadu Review

కథ :
మలేషియా లోని ఇండియన్ రాయబార కార్యాలయం పై దాడి జరగడంతో దర్యాప్తులో భాగంగా దాన్ని చేధించాలంటే సస్పెన్షన్ లో ఉన్న రా ఆఫీసర్ అఖిల్ (విక్రం ) వల్లే అవుతుందని అతడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు . లవ్ ( గే రూపంలో ఉన్న విక్రం ) వల్లే తన భార్య మీరా ( నయనతార ) చనిపోయిందని వాళ్ళ అంతు చూడటానికి మలేషియా వెళతాడు అఖిల్ . మలేషియా వెళ్ళిన అఖిల్ అక్కడ లవ్ ని ఎదుర్కొనే క్రమంలో తన భార్య చూసి షాక్ అవుతాడు . ఇంతకీ అఖిల్ భార్య బ్రతికే ఉందా ? లవ్ ఎవరు ? స్పీడ్ డ్రగ్ వల్ల ఎటువంటి రాబోతోంది ? చివరకు లవ్ ని అంతం చేసాడా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
విక్రం
రీ రికార్డింగ్
నయనతార గ్లామర్
నిత్యా గ్లామర్

డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
స్లో నెరేషన్
పాటలు

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
రా ఆఫీసర్ అఖిల్ గా గే పాత్రలో లవ్ గా రెండు విభిన్న మైన పాత్రలను పోషించి మెప్పించాడు విక్రం . నయనతార గ్లామర్ మరో హైలెట్ ఈ చిత్రానికి . నటన తో పాటు అందాలను తెరమీద పరిచి కంటికింపు ని కలిగించింది అలాగే నిత్యా మీనన్ పాత్ర కొద్దోసేపే అయినప్పటికీ ఫరవాలేదని పించింది . ఇక మిగిలిన పాత్రధారులు తమపరిధి మేరకు బాగానే చేసారు .

సాంకేతిక వర్గం :
దర్శకులు ఆనంద్ శంకర్ కొత్త పాయింట్ ని ఎంచుకొని సైన్స్ పిక్షన్ అంటూ హడావుడి చేయబోయాడు కానీ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు దాంతో కొంతవరకు ఆకట్టుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక పోయాడు . హరీష్ జై రాజ్ పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు కానీ రీ రికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు . ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చింది . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :
సరికొత్త అంశం తో తెరకెక్కిన ఇంకొక్కడు మాస్ మసాలాల కోసం కాకుండా కొత్త తరహా చిత్రం చూద్దామని కోరుకునే వాళ్ళకు మంచి ఛాయిస్ అయితే ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా మాత్రం ఈ ఇంకొక్కడు రూపొందలేదు .

Clck Here English Movie Review : Inkokkadu

>> చంటిగాడి రివ్యూ : 24




Interviews

More

Events

More