చంటిగాడి రివ్యూ : 24

24-telugu-review-c045924c.jpg

24 Review - 24 Movie Review - 24 Telugu Movie Review - 24 Film Rating - Suriya '24' Movie Review - Suriya's 24 Movie Review

వెండితెర పోటుగాళ్ళు : సూర్య, సమంత, నిత్యా మీనన్..   
బాజా భజంత్రీల మోతగాడు : ఏ.ఆర్. రెహమాన్
కాసు దుడ్డు పైసా మనీ మనీ : సూర్య
స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : విక్రమ్ కుమార్
థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - మే - 06 

కథ: 

విలక్షన్ నటుడు సూర్య తన సొంత బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, త్రిపాత్రాభినయంలో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ '24'. చాలా కాలం తర్వాత ఈ జానర్లో వచ్చిన ఈ సినిమా కథలోకి వెళితే.. 
 
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శివ(సూర్య) కష్టపడి కాలంలోకి ప్రయాణించే చేతి గడియారం అంటే టైమ్ ట్రావెలింగ్ వాచ్ ను కనిపెడతాడు. శివతో కలిని గర్బాన్ని పంచుకొని ఒకేసారి భూమిమీడకి వచ్చిన ఆత్రేయ(సూర్య) మాత్రం చెడ్డవాడిగా పెరిగి ఒక ఒక గ్యాంగ్ స్టర్ అవుతాడు. శివ వాచ్ గురించి తెలిసి ఆ వాచ్ దక్కించుకోవాలనుకుంటాడు. ఆత్రేయ ఆ వాచ్ ను సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో శివ భార్యను చంపుతాడు. ఆత్రేయ నుండి తప్పించుకోవదానికి శివ వాచ్, తన పిల్లాడిని తీసుకుని పారిపోతున్న సమయంలో ఆత్రేయ శివని కూడా చంపుతాడు. శివ చనిపొయే ముందు తన బిడ్డ మణి(సూర్య)ను, వాచ్ ను ఓ మహిళకు అప్పగిస్తాడు. ఇక ఆ బిడ్డ మణి పెరిగి పెద్దవాడై ఆ వాచ్ ను ఎలా కనిపెడతాడు..? ఏళ్ళు గడిచినా, వీల్ చైర్ కి పరిమితమైనా ఆ వాచ్ కోసం వెతికే ఆత్రేయకు, మణికి మధ్య నడిచే మైండ్ గేమ్ ఏమిటి..? చివరికి ఈ వాచ్ పోరులో ఎవరు గెలుస్తారు..? అనేదే ఈ సినిమా కథ.  
తారామణుల నటనా చాతుర్యం : 
 
ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది సూర్య త్రిపాత్రాభినయం. సూర్య కెరీర్ లో ఈ సినిమాలోని నటనే బెస్ట్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆత్రేయ పాత్ర. ఇందులో గ్యాంగ్ స్టర్ మరియు వీల్ చైర్ లో కూర్చొనే పాత్రలో సూర్య నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ ఆత్రేయ పాత్ర సినిమా మొత్తం ఆడియన్స్ ని సినిమా వైపు డ్రైవ్ చేస్తుంది. ఇకపోతే సైంటిస్ట్ డాక్టర్ శివ, యంగ్ కుర్రాడు మణి పాత్రల్లో సూర్య చూపిన వైవిధ్యం సహజంగా ఉండడమే కాకుండా, గొప్ప స్థాయిలో కూడా ఉంది. ఇక హీరోయిన్లు సమంత, నిత్యామీనన్ల పాత్రల పరిది తక్కువగా ఉంది.. ఉన్నంతలో బాగానే నటించారు. ఇక గ్యాంగ్ స్టర్ ఆత్రేయకు అసిస్టెంట్ గా అజయ్ నటన బాగుంది. అలాగే సూర్య తల్లిలో పాత్రలో నటించిన శరణ్య సహజంగా ఉండి ఆకట్టుకుటుంది. ఇక ఇతరనటులు గిరీష్ కన్నాడ్, మోహన్ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.  

సాంకేతిక నిపుణుల ప్రతిభ :
 
సినిమాటోగ్రఫీ : తిర్రు సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక పెద్ద అసెట్. తిర్రు మరోసారి తన కెమెరా టాలెంట్ తో ఆడియన్స్ చూపుని నుండి పక్కకి తిప్పుకోనివ్వకుండా లాక్ చేసాడు. ఓవరాల్ ఫిలిం లో తను ఉపయోగించిన ఫ్రేమ్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ మరియు సినిమా మూడ్ కి తగ్గట్టుగా వాడిన కలర్ కాంబినేషన్స్ కూడా అదుర్స్. తిర్రు విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. 
 
విజువల్ ఎఫెక్ట్స్ : బాహుబలి తర్వాత ఇండియన్ టెక్నికల్ స్టాండర్డ్స్ ని మరింత పెంచే సినిమాగా 24ని చెప్పుకోవచ్చు. సినిమాలో టైం ట్రావెల్ కి సంబదించి డిజైన్ చేసిన ప్రతి విజువల్ ఎఫెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ 24 విజువల్ గా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రతి సిజి ఎఫెక్ట్స్ సింప్లీ సూపర్బ్. 
 
సంగీతం : ఆస్కార్ అవార్డు విన్నర్ ఎఆర్ రెహమాన్ అందించిన పాటలు తమిళంలో ఒక అనేలా ఉన్నా తెలుగులో మాత్రం పెద్దగా ఎక్కలేదు. కానీ విజువల్స్ పరంగా గ్లామర్ తోడవడంతో బాగున్నాయనే చెప్పాలి. పాటలు  తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మిస్ కాలేదు. సినిమా కథకి, సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మ్యూజిక్ ని ఇస్తూ సినిమా ఫ్లోని పెంచుతూ పోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. విజువల్స్ కి రెహమాన్ మ్యూజిక్ మరింత ప్రాణం పోసింది.    
 
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి ఎడిటింగ్ 80% బాగుంది కానీ ఒక 20% మిస్ అయ్యింది. సినిమాలో సీన్ టు సీన్ ఫ్లోని పెంచడంలో చాలా బాగా ఎడిట్ చేసాడు.. కథా పరంగా నేటివిటీకోసం పెట్టిన లవ్ ట్రాక్ మాత్రం సినిమా ఫ్లోని కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ అది అవసరం అనే కారణం చేత అతను అలానే వదిలేసాడు. కానీ లవ్ ట్రాక్ ఇంకాస్త ట్రిమ్ చేసి, ఓవరాల్ గా ఒక 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది. 

నిర్మాణం : సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచేలా 2డి ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మించారు. 24 లాంటి సినిమాని సౌత్ లో అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ టు సూర్య అండ్ ప్రొడక్షన్ టీం...  
 
కథ - కథనం - దర్శకత్వం : 
విక్రమ్ కుమార్ తన ప్రతి సినిమాలోనూ ఒక టిపికల్ పాయింట్ ని డీల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. మనంలో పూర్వ జన్మల బంధాలను ఒక అందమైన కావ్యంలా చూపిస్తే, ఇందులో టైం ట్రావెలింగ్ అనే పాయింట్ ని చాలా ఎఫ్ఫెక్టివ్ గా చెప్పాడు. సైన్ ఫిక్షన్ అనే జానర్ లో సినిమా వచ్చి చాలా అన్య్తే చాలా కాలం అవ్వడం వలన ఈ జానర్ అనేది అందరిలోనూ అమితమైన ఆసక్తినిపెంచింది .. కథా పరంగా ఆ అంచనాలను అందుకున్నాడు. అలాగే దానికి అతను రాసుకున్న స్క్రీన్ ప్లే ట్రీట్ మెంట్ అనేదే సినిమాకి హైలైట్... ఫస్ట్ హాఫ్ లో రాసిన ఇంటలిజెన్స్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని వావ్ అనుకునేలా సర్ప్రైజ్ చేస్తూనే, ఇంటర్వల్ బాంగ్ కి ఇంకేం చూపిస్తాడు అనే ఆసక్తిని మరింతపెంచేసాడు. కానీ సెకండాఫ్ లో ఇంటెలిజెంట్ సీన్స్ ని ఫస్ట్ హాఫ్ కంటే తక్కువ రాసుకున్నాడు. నేటివిటీ కోసం లవ్ ట్రాక్ రాసుకున్నాడు.. అందుకనే సెకండాఫ్ తగ్గుతుంది.. కానీ క్లైమాక్స్ లో ఇచ్చే మరో ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. వావ్ అనేలా ఉంటుంది. గత రెండు సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ అనేది కూడా సమపాళ్ళలో రాసుకున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాలో అది మిస్ చేసాడు. ఇక డైరెక్టర్ గా తను అనుకున్న దానిని పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకువచ్చి సక్సెస్ అయ్యాడు. మరోసారి తనలోని ఇంటలిజెన్స్ తో, ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను అందించి థియేటర్స్ కి వచ్చే 80% ఆడియన్స్ ని మెప్పించి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.  
 
సినిమాలో కూర్చోబెట్టేవి :
- మెయిన్ బ్లోయింగ్ అనిపించేలా రాసుకున్న ఇంటెలిజెంట్ ప్లే
- కొత్తగా అనిపించే కథనం 
- సూపర్బ్ అనిపించే ఫస్ట్ హాఫ్
- సెకండాఫ్ ఏంటా అని ఆసక్తిని పెంచే ఇంటర్వల్ బ్లాక్ 
- ఆత్రేయగా సూర్య అద్భుతమైన నటన  
- క్లైమాక్స్ బ్లాక్ అండ్ ట్విస్ట్స్  
- విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ
 
సినిమాలో టార్చర్ చేసేవి : 
- సమంత - సూర్యల లవ్ ట్రాక్ 
- సెకండాఫ్ కాస్త సాగదీయడం 
- కింది సెంటర్ వారికి అంత ఎఫ్ఫ్ఫెక్టివ్ గా కనెక్ట్ కాకపోవడం 
- ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తక్కువ అవ్వడం

విశ్లేషణ : 
 
'24' సినిమా చూడగానే ఆడియన్స్ అనుకునే మాట విక్రమ్ కుమార్ బ్రిలియంట్ డైరెక్టర్... సూర్య నటన అద్భుతః.. మొదటగా టైం ట్రావెలింగ్ నే కాన్సెప్ట్ తో సైన్ ఫిక్షన్ లో సినిమా అనేది ఈ మధ్య కాలంలో లేకపోవడం వలన సినిమా స్టార్ట్ టు ఎండ్ చాలా నటే చాలా కొత్తగా అనిపిస్తుంది. దానివలన హుక్ అయ్యి సినిమా చూస్తాం. ఇక ఇంటలిజెన్స్ థ్రిల్స్ అన్నీ ఆడియన్స్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. కానీ మన నేటివిటీ అనే ఒక చిన్న గీత వలన సినిమాలో లవ్ ట్రాక్ అనేది పెట్టాడు.. కానీ ఆ లవ్ ట్రాక్ అనేదే సినిమాకి కాస్త బోరింగ్ గా తయారైంది. అదొక్కటే సినిమాని కాస్త డౌన్ చేసింది.. అది తీసేసి చూస్తె వావ్ అనిపించినా షాక్ అవ్వనక్కర్లేదు. ఓవరాల్ గా రెగ్యులర్ ఓర మాస్ మాసాలా విత్ కామెడీ ఆశించే వారు తప్ప మిగతా అందరూ ఎంజాయ్ చేయదగిన మరియు కచ్చితంగా చూదగిన సినిమా '24'. 
పవర్ పంచ్ : 
ఏమయ్యా చెప్పాలనుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పచ్చుగా.. మధ్యలో హీరోయిన్ ఉంది కదా అని మనకెందుకు ఈ లవ్ స్టొరీ.. గత రెండు సినిమాల్లో లవ్ మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి కదా అని ఈ సినిమాలోనూ లవ్ ట్రాక్ పెట్టడమేలా!! అది బాలేదని అనిపించుకోవడమేల!!! సమంత లవ్ ట్రాక్ లేని 24 సినిమా కెవ్వు కేక అయితే, లవ్ ట్రాక్ ఉన్న సినిమా గుడ్ అనేలా ఉంది.    
 
చూడాలా వద్దా : కచ్చితంగా చూడాల్సిన సూపర్ విజువల్స్ టైం ట్రావెలింగ్ మూవీ.  
బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : సూపర్ హిట్ 
కొస మెరుపు : 24 - డైరెక్టర్ ఇంటలిజెన్స్ + సూర్య వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ = సూపర్బ్ మూవీ.  
చంటిగాడి రేటింగ్ : 3.25/5
ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని 

<< ఇంకొక్కడు రివ్యూ >> చంటిగాడి రివ్యూ : సుప్రీమ్
Interviews

More

Events

More