చంటిగాడి రివ్యూ : సుప్రీమ్

SUPREMEtELUGU-REVIEW-94e2676d.jpg

వెండితెర పోటుగాళ్ళు : సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా..   
బాజా భజంత్రీల మోతగాడు : సాయి కార్తీక్   
కాసు దుడ్డు పైసా మనీ మనీ : దిల్ రాజు    
స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : అనిల్ రావిపూడి     
థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - మే - 05 

కథ : 
ఈ కథ ఏంటి అనే విషయంలోకి వెళ్ళే ముందు ఈ సినిమా ఏ సినిమాకి మాతృక అనేది చెప్తా.. దాన్ని బట్టి ట్రీట్ మెంట్ ఏదైనా కథ ఏంటనేది తెలిసిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' సినిమాకి ఇది మాతృక అని చెప్పవచ్చు. కానీ పాత్రలను కాస్త మార్చి మోడ్రనైజ్ చేసారు అంతే.. 

ఇక కథలోకి వెళితే.. రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు బాగా డబ్బున్నవాడు.. కానీ ఇప్పుడు ఆ డబ్బంతా పోయి ఒక మధ్యతరగతి లైఫ్ గడుపుతూ, తాగుబోతు అవుతాడు. అతని వారసుడు బాలు(సాయిధరమ్ తేజ్)నే మన హీరో. తను ఉన్న ప్లేస్ లో ఎవ్వరూ ఒంటరి కాదని అనుకునే మనస్తత్వం కలవాడు. అలాంటి బాలుకి ఒక పిల్లవాడు దొరికితే వాడికి రాజు అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. ఇదే టైములో బాలు బెల్లం శ్రీదేవి(రాశీ ఖన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ అయిన శ్రీదేవిని ముప్పు తిప్పలు పెట్టి తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. ఇదిలా ఉండగా అనాధ బాలల కోసం ఓ ట్రస్ట్ నడిపే సాయి కుమార్ మరియు కథకి విలన్ అయిన విక్రమ్ సర్కార్(కబీర్ దుహన్ సింగ్) లు బాలు దగ్గర ఉన్న బాబుకోసం ఎటుకుతుంటారు. కట్ చేస్తే ఒకరోజు విక్రమ్ సర్కార్ మనుషులు బాలుని కొట్టి బాబుని తీసుకెళ్లిపోతారు. ఇక అక్కడి నుంచి బాలు వాళ్ళని ఎలా వేటాడాడు? అసలు ఎవరూ లేని ఆ ఆబుని విక్రమ్ సర్కార్ ఎందుకు కిడ్నాప్ చేసి చంపాలనుకుంటాడు? ఆ బాబు బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేదే మీరు సుప్రీమ్ చూసి తెలుసుకోవాల్సిన కథ.       

తారామణుల నటనా చాతుర్యం : 

సాయిధరమ్ తేజ్ సినిమా సినిమాకి తనలోని నటనని మెరుగు పరుచుకుంటూ నటుడిగా తన స్థాయిని తనే పెంచుకుంటూ పోవడమే కాకుండా, మెగా అభిమానులను కూడా అమితంగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సుప్రీమ్ లో కూడా సాయిధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ మరో మెట్టు పైకి వెళ్ళిందనే చెప్పాలి. సుబ్రమణ్యం ఫర్ సేల్ లో పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఇమిటేట్ చేసినట్టు అనిపించిన తేజ్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఎక్కువగా ఇమిటేట్ చేసారు. దానివలన తనలోని కామెడీ టైమింగ్ చాలా బాగా డైరెక్టర్ కూడా వీలైనంత వరకూ గత సినిమా కంటే కొత్తగా తేజ్ ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సాయిధరమ్ తేజ్ లోని ఎనర్జీ, అదిరిపోయే డాన్సులు, మాస్ కి నచ్చే పంచ్ డైలాగ్స్ చెప్పి ఆడియన్స్ చేత విజిల్స్ వేయించి సినిమాకి సూపర్ హైలైట్ అయ్యాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా తన లుక్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా తన గ్యాంగ్ తో కలిసి ప్రేక్షకులను బాగా నవ్వించింది. అలాగే పాటల్లో మెయిన్ గా అందం హిందోళం సాంగ్ లో రాశీ ఖన్నా తన అందచందాలతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. రాశీ ఖన్నా గ్యాంగ్ లో వెన్నెల కిషోర్ బాగా నవ్వించారు. సినిమాకి కీలకం అయిన పిల్లాడి రాజన్ పాత్రలో చేసిన మిఖైల్ గాంధీ నటన చాలా చాలా బాగుంది. పిల్లాడైనా పాత్రకి ప్రాణం పోసాడు. పటాస్ సినిమాకి కొనసాగింపుగా పృధ్వీ - ప్రభాస్ శీను చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. సెకండాఫ్ లో శ్రీనివాస్ రెడ్డి కామెడీ సినిమాకి హెల్ప్ అయ్యింది. మెయిన్ విలన్స్ గా రవి కిషన్, కబీర్ దుహన్ సింగ్ లు సినిమాలో హీరోయిజంని ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక సాయి కుమార్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు ఎమోషనల్ కంటెంట్ ని ఆడియన్స్ కి రీచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ :

సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరాం కెమరా పనితనం చాలా బాగుంది. సినిమాలో నటీనటుల్ని ప్రెజంట్ చేయడంలో, అలాగే విజువల్స్ ని గ్రాండ్ గా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. రాజస్థాన్ లో షూట్ చేసిన ఎపిసోడ్, అందం హిందోళం సాంగ్ విజువల్స్ సూపర్బ్. 
సంగీతం : సాయి కార్తీక్ అందించిన పాటలు యావరేజ్ అయినప్పటికీ పిక్చరైజేషన్ పరంగా మాత్రం ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తాయి. ఇక నేపధ్య సంగీతం బాగుంది. కామెడీ ఎపిసోడ్స్ కి మరియు హీరో, విలన్ ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది.  

ఎడిటింగ్ : ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది.. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ని పర్ఫెక్ట్ గా కట్చేసాడు. సెకండాఫ్ లో కథ  వలన ఎంటర్ తినేమ్న్ట్ ఉన్నా కొన్ని చోట్లా కాస్త సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం వస్తుంది. ఓవరాల్ గా అక్కడక్కడా ఉన్న లాగ్స్ తప్ప మిగతా అంతా బాగానే చేసాడు.  

నిర్మాణం :.దిల్ రాజు నిర్మాణ విలువలు మాత్రం బాగా గ్రాండ్ గా ఉన్నాయి. 

కథ - కథనం - దర్శకత్వం : 
'పటాస్' ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని దాన్ని కంప్లీట్  గా చెబుతూ సినిమా చేసిన తన సెకండ్ సినిమాకి కూడా యాజిటీజ్ గా అలాంటి ఫ్లోనే ఫాలో అయ్యాడు. ఇక్కడ స్టొరీ లైన్ కోసం కూడా కష్టపడకుండా పసివాడి ప్రాణం + బజ్రంగి భాయ్ జాన్ + చోదాలని ఉంది లాంటి సినిమాలని మిక్స్ చేసి కథ రాసాడు. దానికి హీరో - హీరోయిన్ పాత్రలని కాస్త ఎంటర్టైనింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి వరకూ కథ ఓకే కానీ ఈ తెలిసిన కథని కథనంలో మానేజ్ చేయాలని అనుకున్నాడు అనుకున్న దాని ప్రకారం ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ లో 30 నిమిషాలు ఓకే కానీ ఆ తర్వాత ఎలా నడిపించాలో తెలియక మిగతా 40 నిమిషాలలో చెప్పిందే చెప్పి, చూపించిందే చూపించి కాస్త బోర్ కొట్టించేసాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంతగా సెకండాఫ్ లో కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా చివరి 40 నిమిషాల్లో డైరెక్టర్ చెప్పాలనుకున్నది చెప్పడంలో కాస్త తడబడి, రాంగ్ ట్రాక్ ఎక్కించేసాడు. ఇకపోతే డైరెక్టర్ గా 70% సక్సెస్ అయినా ఒక 30% సక్సెస్ కాలేకపోయాడు. పెర్ఫార్మన్స్ లు బాగా చేయించినా, తను అనుకున్నది పూర్తి శాతం తెరపై చూపించి ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో కనెక్ట్ చేయలేకపోయాడు. మొదటి సినిమాతో పోల్చుకుంటే అనిల్ రావిపూడికి ఆ రేంజ్ హిట్ కాదు కానీ హిట్ సినిమా అవుతుందని చెప్పాలి. 

సినిమాలో కూర్చోబెట్టేవి :
- సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ 
- రాజన్ గా చేసిన మిఖైల్ గాంధీ నటన 
- రాశీ ఖన్నా అందాలు
- ఫస్ట్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయిన కామెడీ

సినిమాలో టార్చర్ చేసేవి : 
- సెకండాఫ్ లో ఫ్లో తగ్గిపోవడం 
- పరమ రొటీన్ అండ్ బోర్ కొట్టించే చివరి 30 నిమిషాలు
- స్క్రీన్ ప్లేలో తడబాటు చెప్పాలనుకున్నదాన్ని పర్ఫెక్ట్ గా డెలివర్ చేయకపోవడం
- సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడం

విశ్లేషణ : 

మొదటి నుంచి నవ్విస్తూ, హీరోయిజం, లవ్ ట్రాక్ తో ఆకట్టుకుంటూ వచ్చి చివరికి నీరు గార్చేసే సినిమాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అలా ఫస్ట్ హాఫ్ అదుర్స్ అనేలా ఉండి, సెకండాఫ్ లో మొదటి 30 నిమిషాలు బాగుంది అనేలా ఉండి,,, కానీ చివరి 30-40 నిమిషాలు అస్సలు బాలేదు అనేలా ఉండే కోవకి చెందిన సినిమానే 'సుప్రీమ్'. చివరి 30 నిమిషాలు మాస్ కోరుకునే యాక్షన్ అంశాలు, ఎమోషనల్ కంటెంట్ ఉన్నా అవి ఎఫ్ఫెక్టివ్ గా రీచ్ కాకపోవడమే సినిమాకి మేజర్ డ్రా బ్యాక్. సినిమా రిలీజ్ టైం, మెగా మాస్ ఫాన్స్ కి కావాల్సిన అంశాలు ఉండడం మరియు 70% సినిమా వినోదాత్మకంగా ఉండడం వలన 'సుప్రీమ్' సినిమా బాక్స్ ఆఫీసు  నిలుస్తుంది. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని చివర్లో కొంత నిరుత్సాహపరిచినా మొదటి నుంచి నవ్వించిన ఎఫెక్ట్ వలన ఆడియన్స్ బాగుంది అంటే చెప్పే మౌత్ టాక్ సినిమాకి హెల్పింగ్ పాయింట్.    

పవర్ పంచ్ : 
సాయిధరమ్ తేజ్ కి 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రేంజ్ హిట్టిచ్చిన మరో సినిమానే 'సుప్రీమ్'.   

చూడాలా వద్దా : 2016 ఫస్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్. కావున చూసేయచ్చు.     
బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : హిట్  
కొస మెరుపు : సుప్రీమ్ - సౌండ్ బాగానే ఉంది.. కానీ బ్లాక్ బస్టర్ రేంజ్ సౌండ్ లేదు.   
చంటిగాడి రేటింగ్ : 2.25/5

ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని 

<< చంటిగాడి రివ్యూ : 24 >> చంటిగాడి రివ్యూ : రాజా చెయ్యి వేస్తే
Interviews

More

Events

More