చంటిగాడి రివ్యూ : రాజా చెయ్యి వేస్తే

Raja Cheyyi Vesthe Movie Review!-35bac2fa.jpg

చంటిగాడి రివ్యూ : రాజా చెయ్యి వేస్తే 

వెండితెర పోటుగాళ్ళు : నారా రోహిత్, తారకరత్న, ఇషా తల్వార్..   
బాజా భజంత్రీల మోతగాడు : సాయి కార్తీక్   
కాసు దుడ్డు పైసా మనీ మనీ : రజినీ కొర్రపాటి    
స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : ప్రదీప్ చిలుకూరి      
థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - ఏప్రిల్ - 29 

కథ : 

తప్పు చెయ్యమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయద్దని మా అమ్మ చెప్పలేదు. అందుకే నాకు తోచింది చేసుకుంటూ వెళ్తే.. దాన్నే తప్పు అంటున్నారు జనం. అనే ఒక సిద్దాంతాన్ని నమ్మే విలనే మన మాణిక్(తారకరత్న). మాణిక్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అలాంటి మాణిక్ ని చంపడానికి చాలా రోజుల నుంచి చక్రి(అవసరాల శ్రీనివాస్) ట్రై చేస్తుంటాడు. అదలా ఉంటే డైరెక్టర్ కావాలనుకునే రాజ(నారా రోహిత్) చైత్రని చూసి ప్రేమలో పడతాడు. నారా రోహిత్ ప్రేమని సక్సెస్ చేయడంలో చక్రి సాయం చేస్తాడు. అలా రాజా - చైత్రల ప్రేమ సక్సెస్ అవుతుంది. కట్ చేస్తే మాణిక్ ని చంపే క్రమంలో చక్రి చనిపోతాడు. అప్పుడే హీరోయిన్ చైత్ర సైడ్ నుంచి కథలో ఓ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు చక్రి ఎవరు? ఎందుకు మాణిక్ ని చంపాలి అనుకుంటాడు? చైత్ర ఇచ్చిన ట్విస్ట్ వల్ల రాజా ఏం చేసాడు. అసలు చక్రి - చైత్రకి ఉన్న సంబంధం ఏమిటి? మాణిక్ చక్రి గురించి తెలుసుకుంటే అతనికి తెలిసిన నిజాలేమిటి? చివరిగా చైత్ర కోసం రాజా ఏం చేసాడు అనేదే మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిన కథ..    

తారామణుల నటనా చాతుర్యం : 

'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తారకరత్న పెర్ఫార్మన్స్.. నెగటివ్ షేడ్స్ లో తారకరత్న పెర్ఫార్మన్స్ చితక్కోట్టేసాడు. తారకరత్న డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్, నటన సింప్లీ సూపర్బ్.. చెప్పాలంటే సినిమాలో ది బిగ్గెస్ట్ స్ట్రాంగ్ రోల్ తనదే.. ఆ పాత్రకి 200% జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఇక నారా రోహిత్ సినిమాలో కాస్ట్యూమ్స్ పరంగా స్టైల్ గా ఉన్నాడు అనిపించినా.. బాగా లావుగా ఉండడం వలన చూడటానికి బాగా ఎబ్బెట్టుగా కనిపిస్తాడు. ఇకనైనా రోహిత్ లావు తగ్గి తన లుక్ మార్చుకోకపోతే నారా రోహిత్ ని చూడడం కష్టం అవుతుంది. పెర్ఫార్మన్స్ పరంగా కొత్తగా ఏం లేదు ఎప్పటిలానే ఓకే ఓకే అనేలా చేసాడు. ఇక హీరోయిన్ ఇషా తల్వార్ మాత్రం లవ్ ట్రాక్ లో చూడటానికి చాలా క్యూట్ క్యూట్ గా ఉంది. తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. ఇక కీలక పాత్రల్లో చేసిన రాజీవ్ కనకాల, శివాజీ రాజ, అవసరాల శ్రీనివాస్, శశాంక్ లు తమ తమ పాత్రల్లో ది బెస్ట్ ఇచ్చారు. వారి సపోర్టింగ్ రోల్స్ సినిమా లో ఎమోషనల్ కంటెంట్ ని కొంత వరకూ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేసాయి. ఇక మిగిలిన వారంతా వారి వారి పాత్రల్లో ఒక అనిపించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ :
సినిమాటోగ్రఫీ : భాస్కర్ సామల సినేమత్రోగ్రఫీ జస్ట్ ఓకే.. విజువల్స్ చూడటానికి కలర్ఫుల్ గానే ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ లో నటీనటుల్ని పర్ఫెక్ట్ గా చూపించడం లేదు అనిపిస్తుంది. అందుకే చూడటానికి విజువల్స్ బాగున్నా అబ్బా అదిరాయి అనుకునేలా ఉండవు.  
సంగీతం : సాయి కార్తీక్ అందించిన పాటలు ఏవీ ఆడియన్స్ కి రీచ్ కాలేదు.. విజువల్ గా మాత్రం పరవాల్ధనిపించాయి. కానీ నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. తను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ట్యూన్స్ కి స్ఫూర్తి అయినప్పటికీ సీన్స్ బాగా కంపోజ్ చేసాడు. మెయిన్ గా తారకరత్న పాత్రకి ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్.  

ఎడిటింగ్ : తమ్మి రాజు అందించిన ఎడిటింగ్ బాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ అయితే సాగుతూ పోతూనే ఉంటుంది. అంట లేగ్త్ లేకుండా కాస్త షార్ట్ గా చెప్పుంటే బాగుండేది. అలా అని ఫస్ట్ హాఫ్ ఏదో కెవ్వు కేక అని కాదు సెకండాఫ్ మీద ఫస్ట్ హాఫ్ బెటర్. 

నిర్మాణం :.ఎప్పటిలానే నిర్మాణ విలువల విలువని పెంచేలానే వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. 

కథ - కథనం - దర్శకత్వం : 
ప్రదీప్ చిలుకూరికి ఇది మొదటి సినిమా.. కానీ సూపర్ సక్సెస్ఫుల్ ఫార్మాట్ అయిన కథనే ఎంచుకున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే కథ పాతదే కానీ దానిలో రాసుకున్న పాత్రలని కొత్తగా రాసుకున్నాడు.. సినిమాని పీక్స్ కి తీసుకెళ్ళే బ్లాక్స్ ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ ఆ కథని ప్రెజంట్ చేసే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పూర్తి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాడు. స్క్రీన్ ప్లే లో ఎంగేజ్ చేసే పాయింట్స్ ని సరిగా రాసుకోలేదు. దాంతో తను రాసుకున్న బ్లాక్స్, పాత్రలు ఆడియన్స్ కి దూరంగా ట్రావెల్ అయ్యాయి. ఇక నేరేషన్ కూడా కాస్త స్లోగానే ఉండడం, రెండుగంటల్లో చెప్పాల్సిన సినిమాని సాగదీసి 2 గంటల 25 నిమిషాలు చెప్పడం ప్రదీప్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అలాగే పేపర్ మీద ఉన్న ఎమోషన్స్ ని డైరెక్టర్ గా తెరపైకి తీసుకురావడంలోనూ తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అనుకున్న కథని తెరపైకి తీసుకువచ్చే క్రమంలో జరిగిన కొన్ని లోపాల వలన తను అనుకున్న కథని ఆడియన్స్ కి ఎఫ్ఫెక్టివ్ గా కనెక్ట్ చేయలేకపోయాడు.  ప్రదీప్ ఒదతి సినిమాతో పాస్ మార్కులు తెచ్చుకున్నాడే తప్ప సక్సెస్ఫుల్ మార్క్స్ తెచ్చుకోలేకపోయాడు. 

సినిమాలో కూర్చోబెట్టేవి :
- నెగటివ్ రోల్లో తారకరత్న చేసిన అల్టిమేట్ పెర్ఫార్మన్స్ 
- క్యూట్ అండ్ బాబ్లీ గర్ల్ గా ఆకట్టుకున్న ఇషా తల్వార్
- రాజీవ్ కనకాల & శివాజీ రాజాల పెర్ఫార్మన్స్

సినిమాలో టార్చర్ చేసేవి : 
- స్టొరీ లైన్ చాలా పాతది అవ్వడం.. 
- వీక్ స్క్రీన్ ప్లే 
- స్లో నేరేషన్ 
- పరమ బోరింగ్ ఎడిటింగ్ 
- హీరో పాత్రని సరిగా బిల్డప్ చేయకపోవడం 
- ఆడియన్స్ సహనానికి టెస్ట్ పెట్టే రన్ టైం
- ఎంటర్టైన్మెంట్ లేకపోవడం 
 
విశ్లేషణ : 
ఈ మధ్య కాలంలో సినిమా ట్రైలర్ చూడగానే అదుర్స్ అనుకునేలా ఉండడం, తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అదుర్స్ అనుకునే మోమెంట్స్ అన్నీ ట్రైలర్ లోనే ఉండడం, సినిమాలో ఏమీ లేకపోవడం ఎక్కువగా జరుగుతోంది. ఆ జాబితాలో చేరిపోయే సినిమానే 'రాజా చెయ్యి వేస్తే'. ట్రైలర్ సూపర్, కేక.. కానీ సినిమాకి వచ్చేసరికి నచ్చేది 40% అయితే నచ్చనిది 60% ఉంది. దీన్నిబట్టే సినిమా ఆడియన్స్ చేత యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయిందని చెప్పచ్చు. నారా రోహిత్- తారకరత్న కాంబినేషన్ లో ఓ ఇంటెన్స్ ఫిల్మ్ చూడబోతున్నాం అని థియేటర్ లోకి వచ్చిన ఆడియన్స్ ఇంటెన్స్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా లేని సినిమా చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు. పేపర్ మీద ఉన్నది తెరపైకి పర్ఫెక్ట్ గా తీసుకురాలేకపోవడమే 'రాజా చెయ్యి వేస్తే' సినిమా ఆడియన్స్ కి నచ్చక పోవడానికి బలమైన కారణం అని చెప్పచ్చు. ఓవరాల్ గా నారా రోహిత్ ఈ ఏడాదిలో మూడో సారి మూడో సినిమా(సావిత్రి, తుంటరి) కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు.  

పవర్ పంచ్ : రాజా చెయ్యి వేస్తే సినిమా డిజాస్టర్ కి ఎక్కువ యావరేజ్ కి తక్కువ అనేలా ఉందండోయ్.. 
 
చూడాలా వద్దా : ఫ్లాప్ అయితే కాదు కాబట్టి చూసేయచ్చులే అనుకునే వాళ్ళు, తారకరత్న ఫ్యాన్స్ ఈ సినిమా చూడచ్చు.   
బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : బిలో యావరేజ్.. అది కూడా సీజన్ హెల్ప్ అయితేనే సుమీ..!  
కొస మెరుపు : రాజా చెయ్యి వేస్తే - చెయ్యి కాదు కాలు వేసినా ఈ సినిమాని హిట్ అవ్వడం కష్టం..!   
చంటిగాడి రేటింగ్ : 1.5/5

ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని 

<< చంటిగాడి రివ్యూ : సుప్రీమ్ >> చంటిగాడి రివ్యూ : సరైనోడు
Interviews

More

Events

More