చంటిగాడి రివ్యూ : పోలీస్

police12-1aa59b23.jpg

వెండితెర పోటుగాళ్ళు : విజయ్, సమంత, అమీ జాక్సన్..   

బాజా భజంత్రీల మోతగాడు : జీవి ప్రకాష్ కుమార్ 

కాసు దుడ్డు పైసా మనీ మనీ : దిల్ రాజు - కలై పులి ఎస్ థాను

స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : అట్లీ  

థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - ఏప్రిల్ - 15

కథ : 

జోసెఫ్ తన కూతురు నివేదితతో కలిసి కేరళలో నివస్తుంటాడు.  నివేదిత ఓ స్కూల్ లో చదువుకుంటుంది.  అయితే, నివేదికతకు స్కూల్ టీచర్ అమీ జాక్సన్ తో పరిచయం ఏర్పడుతుంది.  నివేదిత అంటే అమీ కి ఇష్టం ఏర్పడుతుంది.  ఆ ఇష్టంతోనే నివేదిత తండ్రి జోసెఫ్ కు దగ్గర కావాలని చూస్తుంది.  ఇదిలా ఉండగా, ఓ రోజు స్థానికంగా ఉండే ఒక రౌడి చేస్తున్న అరాచకాలపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వెళ్తుంది.  ఆ విషయం తెలిసిన రౌడి ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు.  ఆ సమయంలో అక్కడికి జోక్యం చేసుకొని ఇష్యూని సర్ది చెప్పాలని చూస్తాడు.  కాని, గూండా వినకపోవడంతో.. జోసెఫ్ తన ప్రతాపం చూపుతాడు.  

అనంతరం అమీ.. జోసెఫ్ ఎవరు అని గట్టిగా అడగడంతో.. సినిమా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తుంది.  విజయ్ కుమార్ అలియాస్ జోసెఫ్ పవర్ఫుల్ డిసిపీ.  హైదరాబాద్ లో ఉద్యోగం చేసే సమయంలో డిసిపీ డాక్టర్ సమంతతో ప్రేమలో పడతాడు.  అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది.  వీరికి ఒక పాప కూడా పుడుతుంది .  అయితే, హైదరాబాద్ లో డిసిపీ గా ఉన్న విజయ్ కుమార్ జోసెఫ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.  అసలు అన్నది.. మిగతా కథ.  

తారామణుల నటనా చాతుర్యం : 

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ సినిమాకి ఒండ్ అండ్ ఓన్లీ పిల్లర్ అని చెప్పాలి. మూడు డిఫరెంట్ పాత్రల్లో విజయ్ ని చూపించిన విధానం, అతని నటన అద్భుతంగా ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒక మాస్ హీరోగా ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళితే, జోసెఫ్ పాత్రలో ఎమోషనల్ గా అందరినీ టచ్ చేసాడు. అలాగే మూడవ పాత్ర ఆడియన్స్ కి పెద్ద సర్ప్రైజ్. ఆ పాత్రలో కూడా తను జీవించాడు. వన్ మాన్ ఆర్మీలా ఈ సినిమాని నడిపించాడు విజయ్. ఇక హీరోయిన్స్ లో మొదటగా సమంత తన కెరీర్లో మరో సూపర్ రోల్ చేసింది. డాక్టర్ గా తన నటన, అలాగే లవ్ ట్రాక్ లో విజయ్ - సమంతల ఎక్స్ ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్.. ఇక స్కూల్ టీచర్ గా కనిపించిన అమీ జాక్సన్ ఇన్నోసెంట్ గా కనిపిస్తూ క్యూట్ లుక్స్ లో అందరినీ మెప్పించింది. ఇకపోతే చిన్న పాప పాత్రలో కనిపించిన బేబీ నైనిక అందరినీ తనవైపుకు ఆకర్షించింది. నెగటివ్ షేడ్స్ లో మహేంద్రన్ బాగానే చేసాడు. ఇక మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల్లో బాగా చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే నటీనటుల నటనే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్.     

సాంకేతిక నిపుణుల ప్రతిభ : 

సినిమాటోగ్రఫీ : జార్జ్ సి విల్లియమ్స్ సినిమాటోగ్రఫీ అద్భుతః అనేలా ఉంది. తను పెట్టిన ప్రతి యాంగిల్, ప్రీతి ఫ్రేం ఆడియన్స్ ని సినిమాకి బాగా కనెక్ట్ చేసేలా యుంటుంది. విన్జువల్స్ అంటే సింప్లీ వండర్ఫుల్.   

సంగీతం : విజవల్సే అదిరిపోయాయి అనుకుంటే ఆ విజువల్స్ ని ఆడియన్స్ కి పీక్స్ లో కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం జివి ప్రకాష్ నేపధ్య సంగీతం. తెలుగులోకి అనువదించిన పాటలు అంట గొప్పగా లేకపోయినా బ్యాక్ గ్రొఉద్ మ్యూజిక్ మాత్రం కెవ్వు కేక. ఆ మ్యూజిక్ వల్లే ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు.   

ఎడిటింగ్ : ఓవరాల్ గా అంథోని ఎడిటింగ్ బాగుంది. కానీ చాలా బాగుంది అనేలా లేదు. కొన్ని చోట్ల తను చేసిన షార్ప్ కట్స్ సూపర్. అలాగే ఫస్ట్ హాఫ్ అదిరింది. కానీ సెకండాఫ్ లో ఆ జోష్ తగ్గుతూ క్లైమాక్స్ దగ్గర బాగా బోర్ కొట్టించడం బాలేదు.  

నిర్మాణం :.దిల్ రాజు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. 

కథ - కథనం - దర్శకత్వం : 

'రాజా రాణి' లాంటి ఓ సూపర్ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టొరీ తర్వాత అట్లీ చేసిన మాస్ ఎంటర్టైనర్ 'పోలీస్'. ముందుగా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మూడు పాత్రలు ఉన్నాయి కదా అని ఎక్కువ అంచనాలు చేసారు. కానీ తను ఓవరాల్ గా భాషా స్టైల్ లో ఓ సింపుల్ రివెంజ్ స్టోరీని కథగా ఎంచుకున్నాడు. కథా పరంగా చూసుకుంటే లైన్ చాలా సింపుల్ కానీ అందులో రాసుకున్న పాత్రలు కొన్ని బాగున్నాయి. అందువల్లే ఆడియన్స్ పాత్రలతో ట్రావెల్ అవుతారు. ఇకపోతే స్క్రీన్ ప్లే పరంగా, దర్శకత్వం పరంగా అట్లీ మార్క్స్ కొట్టేసాడు. మొదటి 20 నిమిషాలు అనగా పోలీస్ ఎంటర్ అయ్యేంతవరకూ కథ భాషా స్టైల్లో ఉంటుంది. ఇక  జోష్ ఉంది.. కానీ డ్రా బ్యాక్ ఏంటి అంటే.. ఆ ట్విస్ట్ తర్వాత ఇక కథలో తెలుసుకోవడానికి ఏమీ ఉండకపోవడం వలన బాగా ఊహాజనితంగా మారింది. దానివల్ల సెకండాఫ్ లో నేరేషన్ బాగా స్లో అయిపోతుంది. సెకండాఫ్ లో కథని ఎక్కువ ఎమోషనల్ వైపు నడిపించి కాస్త స్లో చేసాడు, అలాగే క్లైమాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ట్రాక్ పట్టినట్టు అనిపిస్తుంది. అందుకే చివరికి వచ్చేసరికి ఆడియన్స్ సినిమా నుంచి డీవియేట్ అయిపోతారు. ఇకపోతే దర్శకుడుగా ఒక రెగ్యులర్ రివెంజ్ స్టొరీని, కాస్త కొత్త పంథాలో చెప్పడానికి, అలాగే నటీనటుల నుంచి నటనని పిండుకోవడంలో మరోసారి బెస్ట్ అనిపించుకున్నాడు.    

సినిమాలో కూర్చోబెట్టేవి :

- విజయ్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్  
- జివి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
- సినిమాటోగ్రఫీ

- సమంత, అమీ జాక్సన్ ల అట్రాక్షన్ 

- ఫాదర్ - డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్స్

సినిమాలో టార్చర్ చేసేవి : 

- పరమ రొటీన్ రివెంజ్ స్టొరీ
- సెకండాఫ్ 
- ఒక స్టేజ్ తర్వాత అవసరం లేదు అనిపించే ఎమోషనల్ డ్రామా 
- బలవంతంగా ఇరికించిన సాంగ్స్

- ఊహాజనిత కథనం 

విశ్లేషణ : 

చాలా భాషల్లో చాలా సినిమాల్లో చాలా ఎక్కువగా వచ్చే యాక్షన్ డ్రామా అయిన రివెంజ్ డ్రామా కథని తీసుకొని దానికి వేలైనాన్ని కొత్త రంగులను అద్ది చేసిన సినిమానే 'పోలీస్'. కథ రెగ్యులర్ అయినా, కథనం ఊహాజనితమైనా టేకింగ్ పరంగా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఈ సినిమా కొంతవరకూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. మెయిన్ గా మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. తమిళంలో విజయ్ స్టార్ హీరో కాబట్టి తన ఫాన్స్ కి ఈ సినిమా చాలా బాగుంటుంది. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగా అనిపించినా సెకండాఫ్ మాత్రం చాలా అంటే చాలా స్లో అండ్ బోరింగ్ గా అనిపించడం వలన, క్లైమాక్స్ బాలేకపోవడం వలన సినిమా నుంచి బయటకి వచ్చేటప్పుడు ఆడియన్స్ యావరేజ్ బొమ్మ అనుకుంటూ వస్తారు. రెగ్యులర్ అయినా మాస్ మసాలా స్టఫ్ కోరుకునే వారికి ఈ 'పోలీస్' నచ్చుతాడు. 

పవర్ పంచ్ : 

 పోలీస్ పవర్ఫుల్ గానే ఉన్నాడు కానీ జోసెఫ్ అంట పవర్ఫుల్ గా లేకపోవడం వలన ఓవరాల్ గా యావరేజ్ 'పోలీస్' అనిపించుకున్నాడు. 

చూడాలా వద్దా : ఓన్లీ ఫర్ మాస్ ఆడియన్స్  

బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : యావరేజ్

కొస మెరుపు : పోలీస్ - అదిరిపోయే ఇంటర్వల్ బ్లాక్, బెదిరిపోయే క్లైమాక్స్ బ్లాక్.   

చంటిగాడి రేటింగ్ : 2.25/5

ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని 

<< చంటిగాడి రివ్యూ : సరైనోడు >> Police Telugu Movie Review Live Updates
Interviews

More

Events

More